India: భారత్ 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారడం సాధ్యమే!: ఎన్ డీబీ అధ్యక్షుడు కె.వి.కామత్
- ఆటోమొబైల్ రంగంలో మందగమనం
- భారత్ తో పాటు అంతర్జాతీయంగానూ ఉంది
- చైనా అభివృద్ధి మనకూ సాధ్యమే
ఆటోమొబైల్ రంగంలో మందగమనం ప్రస్తుతం భారత్ కే పరిమితం కాలేదనీ, అంతర్జాతీయంగా ఉందని న్యూ డెవలప్ మెంట్ బ్యాంక్(ఎన్ డీబీ) అధ్యక్షుడు కె.వి.కామత్ తెలిపారు. ప్రయాణాల కోసం ప్రజలు ప్రత్యామ్నాయ వ్యవస్థలను ఆశ్రయించడం కూడా ఇందుకు ఓ కారణమని అభిప్రాయపడ్డారు. అంతర్జాతీయంగా ఎదురవుతున్న ఆర్థిక సవాళ్లను ఎదుర్కొనే శక్తి భారత్ కు ఉందని చెప్పారు.
ఇన్ ఫ్రా, టెక్నాలజీ రంగాల్లో అభివృద్ధితో రాబోయే ఐదేళ్లలో 10 శాతం వృద్ధి నమోదయ్యే అవకాశం ఉందని వ్యాఖ్యానించారు. కేంద్ర ప్రభుత్వం నిర్దేశించుకున్న 5 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరించడం సాధ్యమేనని చెప్పారు. గత 20 ఏళ్లలో చైనా నమోదుచేసిన ఆర్థిక వృద్ధి భారత్ కు కూడా సాధ్యమేనని కామత్ తెలిపారు.