Prabhas: నేను ప్రేమ వివాహం చేసుకుంటే ఆశ్చర్యపోనవసరంలేదు: ప్రభాస్
- సాహో చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న ప్రభాస్
- పెళ్లిపై మాట్లాడిన అగ్రహీరో
- సమయం వచ్చినప్పుడు పెళ్లి జరుగుతుందని వ్యాఖ్యలు
తెలుగు చిత్రసీమలో ఉన్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ లో ప్రభాస్ ముందు వరుసలో ఉంటాడు. వయసు మీరుతున్నా పెళ్లి జోలికి వెళ్లని ఈ అగ్రహీరో తాజాగా పెళ్లి గురించి మాట్లాడిన మాటలు ఆసక్తి కలిగిస్తున్నాయి. సాహో సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు వస్తున్న ప్రభాస్ మీడియా అడిగిన ఓ ప్రశ్నకు సమాధానమిస్తూ, భవిష్యత్తులో తాను ప్రేమ వివాహం చేసుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదని తెలిపారు. సమయం వచ్చినప్పుడు తప్పకుండా పెళ్లి చేసుకుంటానని, అది లవ్ మ్యారేజి కూడా కావొచ్చంటూ తన అభిమానుల్లో ఉత్కంఠ పెంచేశాడు.
కాగా, ప్రభాస్ లేటెస్ట్ మూవీ సాహో ఆగస్టు 30న వరల్డ్ వైడ్ రిలీజ్ కానుంది. యంగ్ డైరెక్టర్ సుజీత్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ హైవోల్టేజ్ యాక్షన్ చిత్రంలో ప్రభాస్ సరసన బాలీవుడ్ భామ శ్రద్ధా కపూర్ కథానాయికగా నటించింది.