KCR: కాళేశ్వరం ప్రపంచంలోనే అతిపెద్ద కుంభకోణం... భట్టి విక్రమార్క వ్యాఖ్యలు

  • రూ.28 వేల కోట్లతో పూర్తయ్యే ప్రాజక్టును రూ.లక్ష కోట్లకు పెంచారంటూ విమర్శలు
  • రివర్స్ పంపింగ్ పేరుతో అక్రమాలకు తెరలేపారని మండిపాటు
  • బీజేపీకి టీఆర్ఎస్ తో ఒప్పందం లేకపోతే కేసీఆర్ అవినీతిపై విచారణ జరిపించాలంటూ డిమాండ్

తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న కాళేశ్వరం ప్రాజక్టు ప్రపంచంలోనే అతిపెద్ద కుంభకోణం అని కాంగ్రెస్ నేత మల్లు భట్టి విక్రమార్క ఆరోపించారు. టెండర్ల ప్రక్రియ నుంచి నిర్మాణం వరకు కాళేశ్వరం ప్రతి దశలోనూ అక్రమాలు జరిగాయని అన్నారు. నాలుగు చోట్ల నీటిని ఎత్తిపోతలు చేస్తూ ప్రాజక్టు వ్యయాన్ని భారీగా పెంచారని తెలిపారు. రివర్స్ పంపింగ్ పేరుతో అందినకాడికి దోచుకున్నారని మండిపడ్డారు. వాస్తవానికి కాళేశ్వరం ప్రాజక్టు అంచనాలు రూ.28 వేల కోట్లు అని, కానీ దాన్ని లక్ష కోట్ల రూపాయలకు పెంచేశారని ఆరోపించారు. బీజేపీకి టీఆర్ఎస్ తో ఎలాంటి ఒప్పందం లేకుండా ఉంటే కాళేశ్వరం ప్రాజక్టు నిర్మాణంలో కేసీఆర్ అవినీతిని వెలికితీయాలని డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News