India: వివిధ నగరాల్లో అమ్మకానికి సిద్ధంగా 4 లక్షల ప్లాట్లు.. అయినా కొనేవారు లేరు!
- హైదరాబాద్ లో ఖాళీగా 4,881 ప్లాట్లు
- ముంబైలో అత్యధికంగా 1,39,984
- రూ. 45 లక్షల్లోపే ధర
ఇండియాలో రియల్ ఎస్టేట్ రంగం కుదేలైందని ప్రాప్ టైగర్ డాట్ కామ్ వెల్లడించింది. దేశంలోని 9 ముఖ్య నగరాలు, పట్టణాల్లో రియల్ ఎస్టేట్ డెవలపర్లు అమ్మకానికి సిద్ధం చేసేందుకు 4.12 లక్షల ఫ్లాట్లను రెడీగా ఉంచినప్పటికీ, వాటిని కొనుగోలు చేసేందుకు ఎవరూ ముందుకు రావడం లేదని పేర్కొంది. ఇవన్నీ అందుబాటు ధరల్లో ఉన్నవేనని, వీటి ధరలు రూ. రూ.45 లక్షల లోపేనని వెల్లడించింది. హైదరాబాద్ సహా, చెన్నై, బెంగళూరు, ముంబై, కోల్ కతా, పుణే, అహ్మదాబాద్, నోయిడా, గుర్ గ్రామ్ తదితర ప్రాంతాల్లో అమ్ముడు కాని ప్లాట్ల సంఖ్య లక్షల్లో చేరిందని తెలిపింది.
తాజా అంచనాల ప్రకారం, దేశవ్యాప్తంగా డెవలపర్ల వద్ద 7,97,623 గృహ యూనిట్లు అందుబాటులో ఉన్నాయని పేర్కొంది. ఇక హైదరాబాద్ విషయానికి వస్తే, ఖాళీగా ఉండి, కొనుగోలుదారులు లేని ప్లాట్ల సంఖ్య 4,881గా ఉందని, ముంబైలో అత్యధికంగా 1,39,984 యూనిట్లు ఖాళీగా ఉన్నాయని ప్రాప్ టైగర్ డాట్ కామ్ పేర్కొంది.