chennai beach: చెన్నై బీచ్‌లో రాత్రివేళ అద్భుతం.. నీలిరంగుతో మెరిసిన అలలు

  • ఆదివారం రాత్రి వెలిగిపోయిన సముద్రపు అలలు
  • దీనిని బయో లుమినిసెన్స్‌‌గా పేర్కొన్న పర్యావరణవేత్తలు
  • ఇది ప్రమాద ఘంటికేనని హెచ్చరిక

చెన్నై బీచ్‌లో ఆదివారం రాత్రి వింత చోటుచేసుకుంది. సముద్రపు అలలు నీలం రంగుతో వెలిగిపోయాయి. చిమ్మ చీకట్లో మిలమిలా మెరుస్తున్న అలలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ వింతను చూసేందుకు స్థానికులు సైతం ఎగబడ్డారు. అలలు వెలుగులు పంచడంపై పర్యావరణ నిపుణులు స్పందించారు. ఈ పరిణామాన్ని బయో లుమినిసెన్స్‌ (సీ స్పార్కెల్స్) అంటారని పేర్కొన్నారు. సముద్రంలోని నోక్టిలూకా సింటిలియన్స్‌ అనే సూక్ష్మజీవుల కారణంగానే ఇది ఏర్పడిందని పేర్కొన్నారు. ఆక్సిజన్ స్థాయులు తగ్గిపోయిన చోట ఇలాంటి మార్పు కనిపిస్తుందన్నారు. ఈ సూక్ష్మజీవులు ఉన్న చోట చేపలు జీవించలేవని, ఇదేమీ హర్షించే పరిణామం కాదని హెచ్చరించారు.

  • Loading...

More Telugu News