Andhra Pradesh: కొనసాగుతున్న అల్పపీడనం.. కోస్తా, రాయలసీమలో నేడు వర్షాలు
- తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం
- జార్ఖండ్, బీహార్‌ను ఆనుకుని అల్పపీడనం
- ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు
వచ్చే 24 గంటల్లో కోస్తాంధ్ర, రాయలసీమల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. వాయవ్య జార్ఖండ్, బీహార్ పరిసరాలను ఆనుకుని అల్పపీడనం కొనసాగుతోందని, దీని ప్రభావంతో మధ్య ప్రాంతం నుంచి ఉత్తర తమిళనాడు వరకు ఒడిశా, ఉత్తర కోస్తా మీదుగా ద్రోణి ఏర్పడిందని పేర్కొంది. ఈ కారణంగా కోస్తాంధ్ర, రాయలసీమల్లో నేడు వర్షాలు కురుస్తాయని, కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలకు అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.