Pakistan: కశ్మీర్‌పై అనుచిత పోస్టులు.. 200 పాకిస్థానీ ఖాతాలను నిషేధించిన ట్విట్టర్
- కశ్మీర్ విషయంలో భారత్‌పై అనుచిత పోస్టులు
- కొరడా ఝళిపించిన ట్విట్టర్
- కొత్త ఉద్యమాన్ని ప్రారంభించిన పాకిస్థానీలు
కశ్మీర్ విషయంలో అనుచిత పోస్టులు చేసిన పాకిస్థాన్ ఖాతాలపై ట్విట్టర్ కొరడా ఝళిపించింది. 200 ట్విట్టర్ ఖాతాలను నిషేధించింది. కశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తిని కల్పించే 370 అధికరణను భారత ప్రభుత్వం రద్దు చేసిన తర్వాత భారత్‌పై పాక్ నెటిజన్లు విషం చిమ్మడం మొదలుపెట్టారు. గత వారం రోజుల్లో ఏకంగా రెండు వందల ఖాతాల నుంచి భారత్‌కు వ్యతిరేక ట్వీట్లు వెల్లువెత్తాయి. దీంతో స్పందించిన ట్విట్టర్ వాటిని నిషేధించింది. దేశం, రాజకీయాలకు సంబంధం లేకుండా ట్విట్టర్ నిష్పక్షపాతంగా వ్యవహరిస్తుందని ఈ సందర్భంగా ట్విట్టర్ పేర్కొంది.
తమ ఖాతాలను స్తంభింపజేయడంపై పాక్‌లోని జర్నలిస్టులు, ప్రభుత్వ అధికారులు, యాక్టివిస్టులు, మిలటరీకి మద్దతు పలికేవారు ట్విట్టర్ వేదికగా నిరసన వ్యక్తం చేస్తున్నారు. #StopSuspendingPakistanis పేరుతో ట్రెండింగ్ చేస్తున్నారు.