Telangana: ఇప్పటివరకూ అవినీతి జరిగిందని సీఎం కేసీఆర్ ఒప్పుకున్నట్టేగా!: కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి
- రాష్ట్రంలో పాలన గాడి తప్పింది
- ఈ విషయాన్ని కలెక్టర్ల సదస్సులో కేసీఆర్ ఒప్పుకున్నారు
- కేసీఆర్ పాలనలో అవినీతి మినహా సాధించింది ఏంటి?
సీఎం కేసీఆర్ వాస్తవ పరిస్థితులను గమనిస్తున్నందుకు కృతఙ్ఞతలు అని, రాష్ట్రంలో పాలన గాడి తప్పందని కలెక్టర్ల సదస్సులో ఆయన ఒప్పుకున్నారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జీవన్ రెడ్డి అన్నారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, కేసీఆర్ పాలనలో అవినీతి ద్వారాలు తెరవడం మినహా సాధించింది ఏంటి? అవినీతిని తగ్గించేందుకు కొత్త రెవెన్యూ పాలసీ అంటున్నారంటే.. ఇప్పటివరకూ అవినీతి జరిగిందని ఒప్పుకున్నట్టేగా అని అన్నారు. రెవెన్యూ అధికారులను కట్టడి చేయాల్సింది కలెక్టర్లు కాదా? కలెక్టర్లను అదుపు చేయాల్సింది సీఎం కాదా? అని ప్రశ్నించారు. బీజేపీ ఇప్పటికైనా టీఆర్ఎస్ అవినీతిపై మాట్లాడటం సంతోషకరమని, టీఆర్ఎస్ ను జేపీ నడ్డా విమర్శించడాన్ని తాను సమర్థిస్తున్నానని అన్నారు.