Sensex: వరుసగా రెండో రోజు నష్టాల్లో ముగిసిన మార్కెట్లు
- ఒత్తిడికి గురైన బ్యాంకింగ్, ఫైనాన్షియల్ స్టాకులు
- 267 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
- 98 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ
దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజు నష్టాలను మూటగట్టుకున్నాయి. బ్యాంకింగ్, ఫైనాన్షియల్ స్టాకులు ఒత్తిడికి గురికావడంతో నష్టాలను నమోదు చేశాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 267 పాయింట్లు పతనమై 37,060కు పడిపోయింది. నిఫ్టీ 98 పాయింట్లు కోల్పోయి 10,918కి దిగజారింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
హీరో మోటో కార్ప్ (1.78%), ఇన్ఫోసిస్ (0.84%), టెక్ మహీంద్రా (0.74%), హిందుస్థాన్ యూనిలీవర్ (0.70%), బజాజ్ ఆటో (0.69%).
టాప్ లూజర్స్:
టాటా మోటార్స్ (-9.29%), యస్ బ్యాంక్ (-8.21%), టాటా స్టీల్ (-4.26%), ఓఎన్జీసీ (-3.12%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (-2.77%).