Jagan: జగన్ సర్కారుకు ఎదురు దెబ్బ... రివర్స్ టెండరింగ్ పై హైకోర్టు స్టే!

  • రివర్స్ టెండర్లపై ముందడుగు వేయవద్దు
  • వివరాలతో నివేదిక సమర్పించండి
  • ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు
ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో జగన్ సర్కారుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. పోలవరం ప్రాజెక్టు రివర్స్ టెండర్ల ప్రక్రియను నిలిపివేయాలని హైకోర్టు కొద్దిసేపటి క్రితం మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. హైడల్ ప్రాజెక్టు కాంట్రాక్టు రద్దుపై గుత్తేదారు సంస్థ నవయుగ, సోమవారం నాడు కోర్టును ఆశ్రయించగా, విచారించి తీర్పును రిజర్వులో వుంచిన హైకోర్టు, ఈ మేరకు స్టే ఇస్తూ, ఆదేశాలు జారీ చేసింది. రివర్స్ టెండరింగ్ పై ముందుకు వెళ్లవద్దని, పూర్తి వివరాలతో తమకు నివేదికను సమర్పించాలని ప్రభుత్వానికి నోటీసులు పంపింది. తదుపరి విచారణను వాయిదా వేసింది.
Jagan
Polavaram
Reverse Tendering
Stay

More Telugu News