Raj Thackeray: ఈడీ విచారణలో రాజ్ థాకరే.. నివురుగప్పిన నిప్పులా ముంబై.. సెక్షన్ 144 అమలు

  • మనీలాండరింగ్ కేసులో రాజ్ థాకరేను విచారించనున్న ఈడీ
  • ముంబైలోని ఈడీ కార్యాలయంలో విచారణ
  • ఈడీ కార్యాలయం పరిసరాల్లో కట్టుదిట్టమైన భద్రత
మహారాష్ట్ర నవ నిర్మాణ సేన (ఎంఎన్ఎస్) అధినేత రాజ్ థాకరేను ఈరోజు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారించనుంది. ఐఎల్ అండ్ ఎఫ్ఎస్ సంస్థకు సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో ఆయన ఈడీ విచారణను ఎదుర్కోబోతున్నారు. ముంబైలోని బల్లార్డ్ పియర్ లో ఉన్న ఈడీ కార్యాలయంలో విచారణ జరగనుంది. ఈ నేపథ్యంలో, ముంబై మహా నగరం నివురుగప్పిన నిప్పులా మారింది. ఎంఎన్ఎస్ శ్రేణులు తీవ్ర స్థాయిలో ప్రతిస్పందించే అవకాశాలున్న నేపథ్యంలో, ముంబైలో సెక్షన్ 144ను విధించారు. అంతేకాదు, ఈడీ కార్యాలయం పరిసరాల్లో భారీ సంఖ్యలో భద్రతాబలగాలను మోహరింపజేశారు.
Raj Thackeray
ED
MNS
Mumbai

More Telugu News