Boy: హైదరాబాద్లో దారుణం.. చెల్లెలిని బంధించి అక్కపై అత్యాచారం చేసిన బాలుడు
- తలుపులు తెరిచి ఉన్న ఇంట్లోకి ప్రవేశించిన బాలుడు
- నిందితుడిని పట్టుకున్న పోలీసులు
- జువైనల్ హోంకు తరలింపు
హైదరాబాద్లోని చాంద్రాయణగుట్ట పరిధిలో దారుణం జరిగింది. ఓ ఇంట్లోకి ప్రవేశించిన 17 ఏళ్ల బాలుడు బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అడ్డొచ్చిన ఆమె చెల్లెల్ని గదిలో బంధించి మరీ దారుణానికి ఒడిగట్టాడు. మంగళవారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం ప్రకారం.. చాంద్రాయణగుట్టలో మంగళవారం రాత్రి ఓ ఇంటి తలుపులు తెరిచి ఉండడాన్ని చూసిన బాలుడు ఇంట్లోకి ప్రవేశించాడు. లోపల బాలిక, ఆమె చెల్లెలు మాత్రమే ఉన్నారు. ఆమె తల్లి, సోదరుడు ఆసుపత్రికి వెళ్లడంతో వారి కోసం ఎదురుచూస్తూ కూర్చున్నారు.
బాలికను గమనించిన బాలుడు ఆమెను బలవంతంగా పడకగదిలోకి ఈడ్చుకెళ్లాడు. గమనించిన ఆమె చెల్లెలు అతడిని అడ్డుకునేందుకు ప్రయత్నించింది. దీంతో అక్కను వదిలేసి ఆమెను పట్టుకుని మరో గదిలోకి తీసుకెళ్లి బంధించాడు. అనంతరం బాలికపై అత్యాచారం చేసి పరారయ్యాడు. ఇంటికొచ్చిన తల్లి జరిగిన ఘోరం తెలిసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో ఉన్న బాలుడిని అరెస్ట్ చేసి జువైనల్ హోంకు తరలించారు.