Pawan Kalyan: వైసీపీ సోషల్ మీడియాపై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయనున్న జనసేన

  • అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారని జనసేన ఆగ్రహం
  • లీగల్ నోటీసులు ఇవ్వాలని నిర్ణయం
  • చట్టపరంగా ముందుకెళ్లాలని పార్టీ శ్రేణులకు పవన్ సూచన
తమపై సోషల్ మీడియా ద్వారా అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారని వైసీపీపై జనసేన ఆగ్రహం వ్యక్తం చేసింది. వైసీపీ సోషల్ మీడియా విభాగంపై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయనుంది. అంతేకాదు, లీగల్ నోటీసులు కూడా ఇవ్వాలని నిర్ణయించింది. జనసేనపై దుష్ప్రచారాలు చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు చేపట్టేలా ముందుకు వెళ్లాలని పార్టీ శ్రేణులకు తమ అధినేత పవన్ కల్యాణ్ స్పష్టం చేశారని ఆ పార్టీ ఓ ప్రకటనలో తెలిపింది.

Pawan Kalyan
Janasena
YSRCP
Social Media

More Telugu News