Sensex: భారీ నష్టాల నుంచి లాభాల్లోకి దూసుకుపోయిన మార్కెట్లు
- 228 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
- 88 పాయింట్లు పుంజుకున్న నిఫ్టీ
- 6 శాతం పైగా లాభపడ్డ వేదాంత లిమిటెడ్
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు లాభాల్లో ముగిశాయి. ఉదయం ట్రేడింగ్ ప్రారంభమైన వెంటనే మార్కెట్లు భారీ నష్టాల్లోకి జారుకున్నాయి. ఆర్థిక మందగమనం భయాలతో సెన్సెక్స్ దాదాపు 300 పాయింట్లకు పైగా పతనమైంది. అయితే, సూపర్ రిచ్ సర్ ఛార్జ్ నుంచి ఎఫ్పీఐలకు మినహాయింపును ఇస్తారనే వార్తలతో మళ్లీ పుంజుకున్నాయి. ఈ నేపథ్యంలో, ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 228 పాయింట్లు లాభపడి 36,701కి పెరిగింది. నిఫ్టీ 88 పాయింట్లు పుంజుకుని 10,829 వద్ద స్థిరపడింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
వేదాంత లిమిటెడ్ (6.55%), యస్ బ్యాంక్ (5.24%), ఓఎన్జీసీ (4.66%), మహీంద్రా అండ్ మహీంద్రా (4.09%), టాటా స్టీల్ (3.43%).
టాప్ లూజర్స్:
ఇండస్ ఇండ్ బ్యాంక్ (-1.90%), ఐటీసీ (-1.71%), ఐసీఐసీఐ బ్యాంక్ (-0.85%), హిందుస్థాన్ యూనిలీవర్ (-0.69%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (-0.69%).