KTR: యంగ్ లుక్ తో ఉన్న కేటీఆర్... అరుదైన ఫొటో ఇదిగో!

  • 1999 నాటి ఫొటో ట్వీట్ చేసిన కేటీఆర్
  • ఓ ఫ్రెండ్ తో కలిసి ఫొటోలో దర్శనమిస్తున్న టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్
  • జీన్స్ షర్ట్, మోడ్రన్ హెయిర్ స్టయిల్ తో ఆకట్టుకునేలా ఉన్న కేటీఆర్
టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటారు. సమస్యలపై సత్వరమే స్పందిస్తూ ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉంటారు. అదే సమయంలో అప్పుడప్పుడు కొన్ని అరుదైన ఫొటోలను షేర్ చేస్తూ సర్ ప్రైజ్ చేస్తుంటారు. తాజాగా, 20 ఏళ్ల నాటి ఫొటోను ట్విట్టర్ లో పోస్టు చేశారు. ఎంతో యంగ్ లుక్ తో డైనమిక్ గా కనిపిస్తున్న కేటీఆర్ ను ఆ ఫొటోలో చూడొచ్చు. డెనిమ్ షర్టులో, మోడ్రన్ హెయిర్ స్టయిల్ తో ఉన్న కేటీఆర్ మరో ఫ్రెండ్ తో కలిసి ఆ ఫొటోలో దర్శనమిస్తున్నారు.
KTR
Photo
Twitter
Telangana
Social Media

More Telugu News