chattisgargh: ఛత్తీస్ గఢ్ లో భారీ ఎన్ కౌంటర్.. ఐదుగురు మావోయిస్టుల కాల్చివేత!
- నారాయణ్ పూర్ అటవీప్రాంతంలో ఘటన
- పక్కా సమాచారంతో కూంబింగ్ ప్రారంభించిన బలగాలు
- ఇరువర్గాల మధ్య భీకర కాల్పులు
ఛత్తీస్ గఢ్ అటవీప్రాంతం మరోసారి నెత్తురోడింది. నారాయణ్ పూర్ జిల్లాలో మావోయిస్టుల అలికిడిపై భద్రతాబలగాలకు పక్కా సమాచారం అందింది. దీంతో బలగాలు భారీఎత్తున కూంబింగ్ చేపట్టాయి. నారాయణ్ పూర్ అటవీప్రాంతంలో బలగాల రాకను గమనించిన మావోయిస్టులు విచక్షణారహితంగా కాల్పులు ప్రారంభించారు. దీంతో అప్రమత్తమైన భద్రతాబలగాలు కవర్ తీసుకుంటూ ఎదురుకాల్పులు జరిపాయి.
ఈ ఘటనలో ఐదుగురు మావోయిస్టులు ఘటనాస్థలంలోనే ప్రాణాలు కోల్పోగా, మిగతా మావోలు కాల్పులు జరుపుతూ పారిపోయారు. ఈ సందర్భంగా మావోల కాల్పుల్లో ఇద్దరు జవాన్లకు గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. కాగా, మిగిలిన మావోయిస్టుల కోసం భద్రతాబలగాలు కూంబింగ్ కొనసాగిస్తున్నాయి.