Amit Shah: ఓ కుటుంబ సభ్యుడ్ని కోల్పోయినంత బాధగా ఉంది: జైట్లీ మృతికి అమిత్ షా తీవ్ర విచారం
- అరుణ్ జైట్లీ కన్నుమూత
- వ్యక్తిగతంగా తనకు తీరని లోటు అన్న అమిత్ షా
- ఎప్పటికీ ఆయనే మార్గదర్శి అంటూ వ్యాఖ్యలు
బీజేపీ అగ్రనేతల్లో ఒకరైన అరుణ్ జైట్లీ అనారోగ్యంతో పోరాడుతూ ఈ మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల కేంద్ర హోం మంత్రి అమిత్ షా తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఓ కుటుంబ సభ్యుడ్ని కోల్పోయినంత బాధగా ఉందని వ్యాఖ్యానించారు. జైట్లీ మరణం వ్యక్తిగతంగా తనకు తీరని లోటు అన్నారు. జైట్లీ పార్టీ అగ్రనేతగానే కాకుండా తన కుటుంబంలో ముఖ్యుడిగా, తనకు మార్గదర్శిగా ఉన్నారని, ఇప్పుడాయన లేరంటే భరించలేనంత బాధ కలుగుతోందని తెలిపారు.