arunjaitley: యమునా నది తీరంలో అరుణ్‌జైట్లీ అంతిమ సంస్కారం
- మధ్యాహ్నం 2.30 గంటలకు అంత్యక్రియలు
- 1.30 గంటల వరకు కేంద్ర కార్యాలయంలో పార్దివ దేహం
- జైట్లీ కడసారి చూపునకు తరలివస్తున్న నేతలు
కమల దళంలో ట్రబుల్ షూటర్, మాజీ ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ పార్థీవ దేహానికి ఈరోజు మధ్యాహ్నం 2.30 గంటలకు యమునానది తీరంలోని నిగంబోధ్ ఘాట్‌లో ప్రభుత్వ లాంఛనాలతో అంతిమ సంస్కారం నిర్వహించనున్నారు. ఆయన పార్థీవ దేహాన్ని 1.30 గంటల వరకు కేంద్ర కార్యాలయంలో ఉంచి అనంతరం అంతిమ యాత్ర ప్రారంభిస్తారు. జైట్లీ కడసారి చూపుకోసం పార్టీ నాయకులు, అభిమానులు భారీగా తరలివస్తున్నారు.
ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆర్ఎల్డీ నేత అజీత్ సింగ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మోతీలాల్ వోహ్రా, ఎన్సీపీ అధినేత శరద్ పవార్ తదితరులు అరుణ్‌జైట్లీ భౌతిక కాయానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. నివాళులర్పించిన వారిలో టీడీపీ ఎంపీలు కనకమేడల రవీంద్రకుమార్, కంభంపాటి రామ్మోహన్రావు, గల్లా జయదేవ్, కేశినేని నాని, ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఉన్నారు.