KCR: కాళేశ్వరం ప్రాజెక్టు కేంద్రం చేతిలోకి వెళ్తే.. కేసీఆర్ బండారం బయటపడుతుంది: జీవన్ రెడ్డి

  • దేశంలో కేసీఆర్ తప్ప ఇంకెవరూ ప్రాజెక్టులు కట్టలేదా?
  • కాళేశ్వరంకు జాతీయ హోదా రాకుండా కేసీఆర్ అడ్డుకుంటున్నారు
  • రాష్ట్రం లక్ష కోట్ల అప్పులో చిక్కుకోవడానికి కేసీఆరే కారణం
దేశంలో మరెవరూ ప్రాజెక్టులు కట్టలేదా? తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రమే కట్టారా? అని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై అనవసరమైన హైప్ క్రియేట్ చేయడం మినహా కేసీఆర్ చేసిందేమీ లేదని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా రాకుండా అడ్డుకుంటున్నది కేసీఆరే అని ఆరోపించారు. ఒక్కసారి కాళేశ్వరం ప్రాజెక్టు కేంద్రం చేతిలోకి వెళ్తే... కేసీఆర్ బండారం బట్టబయలవుతుందని వ్యాఖ్యానించారు. తెలంగాణ లక్ష కోట్ల అప్పుల ఊబిలోకి చిక్కుకుపోవడానికి కేసీఆరే కారణమని చెప్పారు. త్వరలోనే కాంగ్రెస్ నేతలందరం కలసి ప్రాజెక్టుల బాట పడతామని... కేసీఆర్ అవినీతిని ప్రజలకు వివరిస్తామని తెలిపారు.
KCR
TRS
Jeevan Reddy
Congress
Kaleshwaram Project

More Telugu News