Jenan Moussa: గృహహింసపై అవగాహనకు యువతి పోస్ట్ చేసిన సంచలన వీడియో!

  • పూలు అందుకోవడంతో మొదలై, శారీరక హింస
  • తన బాధను చెప్పకనే చెప్పేలా వీడియో 
  • జెనాన్ ముస్సా పోస్ట్ చేసి వీడియో వైరల్
గృహ హింసపై మహిళల్లో అవగాహన పెంచే దిశగా, ఓ యువతి తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియో ఒకటి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సంచలనమైంది. జెనాన్ ముస్సా అనే యువతి, "గృహహింసపై అవగాహన కల్పించేందుకు ఇదో శక్తిమంతమైన వీడియో" అన్న క్యాప్షన్ తో దీనిని పోస్ట్ చేసింది.

తన భర్త నుంచి సంతోషంతో పూలు అందుకోవడంతో మొదలయ్యే ఈ వీడియోలో ఆడవారు భౌతికంగా, మానసికంగా పడే బాధను, చెందే వేదనను కళ్లకు కట్టినట్టు చూపింది. భర్త శారీరకంగా హింస పెడితే, పెదవులపై రక్తాన్ని కనిపించకుండా ఉండేందుకు లిప్ స్టిక్ ను, ముఖంపై గాయాలను మేకప్‌ తో కప్పి ఉంచేందుకు ఆమె ప్రయత్నిస్తుంది. గాయాలు ఎక్కువ కావడంతో, తన జుట్టుతో వాటిని కప్పేందుకు ప్రయత్నిస్తుంది. తనలోని బాధను చెప్పకనే చెప్పే ప్రయత్నం చేసింది.

ఇక గృహహింస ఎంతో తీవ్రమైనదని, సున్నితమైన అంశం గురించి, ఇంత విడమరచి వీడియో తయారు చేయడం అభినందించదగ్గ విషయమని నెటిజన్లు పొగుడుతున్నారు.
Jenan Moussa
Twitter
Harrasment
Viral Videos

More Telugu News