Arun Jaitly: విషాదంలోనూ చేతివాటం...జైట్లీ అంత్యక్రియల సందర్భంగా ప్రముఖుల ఫోన్లు మాయం
- యమునానది తీరాన కేటుగాళ్ల తీరిది
- ఐదుగురి విలువైన ఫోన్లు పోయినట్లు గుర్తింపు
- అన్నీ కేంద్ర మంత్రులు, అధికారులవే
అక్కడంతా తీవ్ర విషాదంలో మునిగి ఉంటే కేటుగాళ్లకు మాత్రం అదో అవకాశంలా కనిపించింది. చేతివాటం ప్రదర్శించి ఫోన్లు మాయం చేశారు. ఇటీవల అనారోగ్యంతో కన్నుమూసిన కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అంత్యక్రియల సందర్భంగా ఢిల్లీలోని యమునానది ఒడ్డున నిగమ్బోద్ ఘాట్ వద్ద దుండగులు చేతివాటం ప్రదర్శించి కేంద్ర మంత్రులు బాబుల్ సుప్రియో, సోమ్ప్రకాష్, సుప్రియో కార్యదర్శి, మరో ఇద్దరు ఉన్నతాధికారుల ఫోన్లు కొట్టేశారు.
‘నిగమ్బోద్ ఘాట్ వద్ద ఓ చోట జనం బాగా ఉన్నారు. ఆ సమయానికి నేను కూడా అక్కడికి వెళ్లాను. అదే సమయంలో నా ఫోన్ మాయమయ్యింది’ అని బాబుల్ సుప్రియో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇటువంటి ఘాట్లో ఎక్కువ సీసీ కెమెరాలు ఉండాలని ఆయన పోలీసులకు సూచించారు.