Anantha Sriram: చిరంజీవి గారు పిలిచి అవకాశం ఇవ్వడం ఎప్పటికీ మరిచిపోలేను: సినీ గేయ రచయిత అనంత శ్రీరామ్
- 'అందరివాడు' షూటింగులో చిరూను కలిశాను
- చిరంజీవిగారు వెంటనే ఛాన్స్ ఇచ్చారు
- అందులో 'ఓ పడుచు బంగారమా..' పాట రాశానన్న శ్రీరామ్
సినీ యువ గేయ రచయితగా అనంత శ్రీరామ్ కి మంచి పేరు వుంది. ఆయన రాసిన పాటలు చాలా వరకూ బాగా పాప్యులర్ అయ్యాయి. తాజాగా 'ఆలీతో సరదాగా కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, ఒక ఆసక్తికరమైన విషయాన్ని గురించి ప్రస్తావించాడు.
"చిత్ర పరిశ్రమలోకి నేను అడుగుపెట్టిన తరువాత తొలిసారిగా 'కాదంటే అవుననిలే' సినిమాకు పాటలు రాశాను. ఆ సినిమా నిర్మాత నన్ను చిరంజీవిగారికి పరిచయం చేశారు. ఆ సమయంలో చిరంజీవిగారు 'అందరివాడు' సినిమా చేస్తున్నారు. మా నిర్మాత ఇచ్చిన 'కాదంటే అవుననిలే' సినిమా పాటల సీడీని రామోజీ ఫిల్మ్ సిటీకి కారులో వెళుతూ చిరంజీవి విన్నారు. పాటల సాహిత్యంలో విషయం వుందనిపించి, ఆ మరుసటి రోజే నన్ను పిలిపించి 'అందరివాడు' కోసం ఒక పాట రాయమన్నారు. అలా ఆ సినిమా కోసం 'ఓ పడుచు బంగారమా .. పలుకవే సరిగమ' అనే పాట రాశాను" అని చెప్పుకొచ్చాడు.