Sensex: రిజర్వ్ బ్యాంక్ ఎఫెక్ట్.. లాభాల్లో ముగిసిన మార్కెట్లు
- 147 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
- 47 పాయింట్లు పెరిగిన నిఫ్టీ
- 9 శాతం వరకు లాభపడ్డ టాటా మోటార్స్
దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజు లాభాల్లో ముగిశాయి. కేంద్ర ప్రభుత్వానికి రూ. 1.76 లక్షల కోట్లను బదిలీ చేస్తామని రిజర్వ్ బ్యాంక్ ప్రకటించిన నేపథ్యంలో, మార్కెట్లు లాభాల్లో కొనసాగాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 147 పాయింట్లు లాభపడి 37,641కి పెరిగింది. నిఫ్టీ 47 పాయింట్లు పుంజుకుని 11,105 వద్ద స్థిరపడింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
టాటా మోటార్స్ (8.91%), టాటా స్టీల్ (3.88%), ఎన్టీపీసీ (3.04%), యస్ బ్యాంక్ (3.02%), వేదాంత లిమిటెడ్ (2.78%).
టాప్ లూజర్స్:
భారతి ఎయిర్ టెల్ (-3.29%), టెక్ మహీంద్రా (-2.48%), ఇన్ఫోసిస్ (-2.03%), టీసీఎస్ (-1.50%), కొటక్ మహీంద్రా బ్యాంక్ (-0.81%).