Harley Davidson: అట్టహాసంగా హార్లే డేవిడ్ సన్ కొత్త బైక్ ఆవిష్కరణ

  • లైవ్ వైర్ పేరుతో ఎలక్ట్రిక్ బైక్ తీసుకువచ్చిన హార్లే డేవిడ్ సన్
  • మరికొన్ని నెలల్లో భారత్ రోడ్లపై కొత్త బైక్
  • ధర రూ.21 లక్షలు!

క్రూయిజర్ బైకుల రారాజు హార్లే డేవిడ్ సన్ నుంచి కొత్త బైక్ వస్తోంది. దీనిపేరు లైవ్ వైర్. ఇది పూర్తిగా విద్యుత్ ఆధారిత మోటార్ సైకిల్. గత జనవరిలో లైవ్ వైర్ డీటెయిల్స్ ను గ్లోబల్ మార్కెట్లో వెల్లడించినా, తాజాగా భారత్ లో ఇవాళ అట్టహాసంగా జరిగిన ఓ కార్యక్రమంలో ఆవిష్కరించారు. మరికొన్ని నెలల్లోనే లైవ్ వైర్ భారత్ రోడ్లపై పరుగులు తీయనుంది.

కంప్లీట్ ఎలక్ట్రిక్ బైక్ గా రూపుదిద్దుకున్న లైవ్ వైర్ లో 15.5 కిలోవాట్ల బ్యాటరీ అమర్చారు. బైక్ ఇంజిన్ స్టార్ట్ అయిన 3.5 సెకన్లలో 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోవడం దీని ప్రత్యేకత. సింగిల్ చార్జింగ్ తో ఏకబిగిన 235 కిలోమీటర్ల దూరం ప్రయాణించవచ్చు. అంతేగాకుండా, దీంట్లో యాప్ ఆధారిత టెలీమాటిక్స్ కంట్రోల్ యూనిట్ (టీసీయూ) ఏర్పాటు చేశారు.

దీని ద్వారా బైక్ బ్యాటరీ చార్జింగ్, వెహికిల్ ట్రాకింగ్, సర్వీస్ పీరియడ్ వివరాలు, చార్జింగ్ స్టేషన్ల వివరాలు తెలుసుకోవచ్చు. టచ్ స్క్రీన్ తో ఫోన్ సదుపాయం, మ్యూజిక్, బ్లూటూత్ సహా ఇన్ఫోటైన్ మెంట్ కూడా లభ్యమవుతుంది. టీసీయూ వ్యవస్థ రూపకల్పనలో జపాన్ ఎలక్ట్రానిక్స్ దిగ్గజం పానాసోనిక్ సహకారం అందించింది. ఇక దీని ఖరీదు విషయానికొస్తే అమెరికాలో 29,799 డాలర్లుగా నిర్ణయించారు. అదే భారత కరెన్సీలో రూ.21 లక్షలు పలకవచ్చు.

  • Loading...

More Telugu News