Pakistan: సరిహద్దుల వద్ద కమెండోలను మోహరించిన పాకిస్థాన్
- నియంత్రణ రేఖ వద్ద 100 మందికి పైగా పాక్ స్పెషల్ కమెండోలు
- ఉగ్రసంస్థలతో కలసి దాడులకు తెగబడే అవకాశం
- కమెండోల కదలికలపై నిఘా ఉంచిన ఇండియన్ ఆర్మీ
కశ్మీర్ విషయంలో ఎదురుదెబ్బ తగలడంతో పాకిస్థాన్ రగిలిపోతోంది. అంతర్జాతీయ సమాజం ముందు ఏకాకిగా మిగిలిపోవడాన్ని జీర్ణించుకోలేకపోతోంది. అయినా, తీరు మార్చుకోకుండా... భారత్ పై రకరకాలుగా అక్కసు వెళ్లగక్కుతోంది. తాజాగా నియంత్రణ రేఖ (ఎల్వోసీ) వద్ద 100 మందికి పైగా స్పెషల్ సర్వీస్ గ్రూప్ కమెండోలను పాక్ సైన్యం మోహరింపజేసిందనే విషయాన్ని ఇండియన్ ఆర్మీ గుర్తించింది.
పాక్ భూభాగం నుంచి పని చేసే ఉగ్ర సంస్థలతో కలసి ఈ కమెండోలు దాడులకు తెగబడే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో, పాక్ కమెండోల కదలికలపై నిఘా ఉంచామని ఆర్మీ అధికారులు తెలిపారు.