Sudhakar: అప్పుడు ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడ్డాను: హాస్య నటుడు సుధాకర్
- నాకు కమ్యూనిస్టు భావాలు ఎక్కువ
- ఎంజీఆర్ తన పార్టీలో చేరమన్నారు
- షూటింగు దశలోవున్న నా సినిమాలన్నీ ఆపేశారన్న సుధాకర్
తెలుగులో హాస్య నటుడిగా సుధాకర్ సందడి చేశారు. ఇప్పటి సీనియర్ హీరోలందరి సినిమాల్లోను ఆయన నటించి మెప్పించారు. ఒక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, కెరియర్ పరంగా తనకి ఎదురైన ఇబ్బందిని గురించి ప్రస్తావించారు.
"అప్పటికి నాకు ఇంకా పెళ్లి కాలేదు .. కమ్యూనిస్టు భావాలు ఎక్కువగా ఉండేవి. ఒక్కసారిగా వచ్చేసిన స్టార్ డమ్ తో తమిళంలో వరుస సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాను. ఆ సమయంలోనే ఎంజీఆర్ పార్టీలో చేరమనే ఆహ్వానం వచ్చింది. 'నేను కమ్యూనిస్టును .. వేరే ఏ పార్టీలో చేరను' అని చెప్పేశాను. నేను వాళ్ల పార్టీలో చేరలేదనే కోపంతో, నిర్మాణ దశలో వున్న నా సినిమాలన్నింటినీ ఆపేశారు. దాంతో ఆ సమయంలో ఆర్ధికంగా నేను చాలా ఇబ్బందులు పడ్డాను. భారతీరాజాగారు నాకు ముందే చెప్పారు .. 'తమిళంలో నిన్ను ఇబ్బంది పెట్టే అవకాశాలు వున్నాయి .. తెలుగు ఇండస్ట్రీకి వెళ్లిపో' అన్నారు. అదృష్టం కొద్దీ ఆ సమయంలోనే నాకు తెలుగులో మంచి సినిమాలు పడ్డాయి" అని చెప్పుకొచ్చారు.