Rs. 100: కరెన్సీ నోట్లకు హంగులు.. ఇకపై మెరవనున్న రూ. 100 నోట్లు
- రూ. 100 నోట్లకు వార్నిష్ పూత
- వార్షిక నివేదికలో తెలిపిన ఆర్బీఐ
- ఈ ఆర్థిక సంవత్సరంలో 15 శాతం పెరిగిన బ్యాంకు మోసాలు
కరెన్సీ నోట్లకు మరింత మెరుగులు దిద్దేందుకు ఆర్బీఐ సిద్ధమైంది. తొలుత రూ. 100 నోట్లపై దృష్టి సారించింది. ఈ నోట్లపై వార్నిష్ పూత వేయనున్నట్టు తన వార్షిక నివేదికలో పేర్కొంది. ఈ పూత పూయడం వల్ల ఈ నోట్లు మెరుస్తాయని తెలిపింది. 2019 నాటికి నగదు చలామణీ 17 శాతం పెరిగిందని ఆర్బీఐ వెల్లడించింది. కరెన్సీలో 51 శాతం వాటా రూ. 500 నోట్లదేనని చెప్పింది. గత ఏడాదితో పోల్చితే ఈ ఆర్థిక సంవత్సరంలో బ్యాంకు మోసాలు 15 శాతం పెరిగాయని తెలిపింది. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లోనే అధిక మోసాలు జరిగాయని పేర్కొంది.