sand scarcity: ఇసుక కొరత సృష్టించి పేదల పొట్ట కొట్టారు: మంగళగిరి ధర్నాలో మాజీ మంత్రి లోకేశ్

  • పాతబస్టాండ్‌ అన్నక్యాంటీన్‌ వద్ద టీడీపీ శ్రేణుల నిరసన
  • ఇసుక కొరతను నిరసిస్తూ ప్లకార్డుల ప్రదర్శన
  • పేదల రాజ్యాన్ని పులివెందుల చేశారంటూ విమర్శలు

ఏపీలో ఇసుక కొరత సృష్టించి నిరుపేదలకు పనుల్లేకుండా చేసి వారి పొట్టకొట్టారని టీడీపీ నాయకుడు, మాజీ మంత్రి నారా లోకేశ్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో తీవ్ర ఇసుక కొరతను నిరసిస్తూ గుంటూరు జిల్లా మంగళగిరిలో టీడీపీ శ్రేణులతో కలిసి ఈరోజు ఉదయం ఆయన ధర్నాకు దిగారు. పాతబస్టాండ్‌ వద్ద మూతపడిన అన్న క్యాంటీన్‌ ఎదుట బైఠాయించి ధర్నా నిర్వహించారు.

ఈ సందర్భంగా ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేయడమేకాక, ప్లకార్డులు ప్రదర్శించారు. కాగా, ధర్నాలో పాల్గొన్న పలువురు నిర్మాణ రంగ కూలీలు ఇసుక కొరత వల్ల పనులు నిలిచిపోయి ఉపాధి లేక తాము పడుతున్న ఇబ్బందులను వివరించారు. ఈ సందర్భంగా లోకేశ్ మాట్లాడుతూ పేదల రాజ్యాన్ని జగన్‌ పులివెందులుగా మార్చేశారని ధ్వజమెత్తారు.

  • Loading...

More Telugu News