Warangal: తెలుగు రాష్ట్రాల్లో తొలిసారి.. వరంగల్ లో ‘రౌడీ షీటర్ల మేళా’
- ఒకేసారి 133 మందిపై రౌడీ షీట్లు తొలగింపు
- ఇంతమందిపై రౌడీ షీట్ల తొలగింపు ఇదే ప్రథమం
- వరంగల్ సీపీ విశ్వనాథ రవీందర్ నిర్ణయంపై హర్షం
వరంగల్ పోలీసులు రికార్డు సృష్టించారు. వరంగల్ లో ‘రౌడీషీటర్ల మేళా’ను నిర్వహించారు. తెలుగు రాష్ట్రాల్లో తొలిసారిగా ఈ మేళాను నిర్వహించడం గమనార్హం. కొన్నేళ్లుగా నేరాలకు పాల్పడకుండా, సత్ప్రవర్తన కలిగి ఉన్న133 మందిపై రౌడీ షీట్లను ఒకేసారి ఎత్తివేశారు. వరంగల్ కమిషనరేట్ పరిధిలోని సెంట్రల్, ఈస్ట్, వెస్ట్ జోన్లలో 783 మందిపై రౌడీషీట్ ఉంది. వారిలో ఆరోగ్య సమస్యలతో పాటు భవిష్యత్ ఉన్న యువకులపై రౌడీషీట్ ను తొలగించారు.
'
వరంగల్ సిటీ పోలీస్ కమిషనర్ విశ్వనాథ రవీందర్ తీసుకున్న ఈ నిర్ణయంపై వరంగల్ సెంట్రల్, ఈస్ట్, వెస్ట్ జోన్ డీసీపీలు హర్షం వ్యక్తం చేశారు. వరంగల్ చరిత్రలో ఇంతమందిపై రౌడీ షీట్లను తొలగించడం ఇదే ప్రథమం. కాగా, వరంగల్ పోలీస్ కమిషనరేట్ లో నిన్న ఈ మేళాను నిర్వహించారు. రౌడీ షీటర్ల ప్రవర్తన, ఫిట్ నెస్ ను పరిశీలించారు.