India: టాస్ గెలిచిన వెస్టిండీస్.. టీమిండియాకు బ్యాటింగ్
- 13 పరుగులకే అవుటైన కేఎల్ రాహుల్
- క్రీజులో మయాంక్, పుజారా
- మ్యాచ్ కు ఆతిథ్యమిస్తున్న సబీనా పార్క్ స్టేడియం
కింగ్ స్టన్ లోని సబీనా పార్క్ స్టేడియంలో వెస్టిండీస్, టీమిండియా మధ్య రెండో టెస్టు ప్రారంభమైంది. ఈ పోరులో టాస్ గెలిచిన ఆతిథ్య జట్టు ఫీల్డింగ్ ఎంచుకోగా, భారత్ బ్యాటింగ్ కు దిగింది. 15 ఓవర్లు ముగిసేసరికి కోహ్లీ సేన 1 వికెట్ నష్టానికి 43 పరుగులు చేసింది. ఓపెనర్ కేఎల్ రాహుల్ 13 పరుగులు చేసి హోల్డర్ బౌలింగ్ లో అవుట్ కాగా, మరో ఓపెనర్ మయాంక్ అగర్వాల్ కు తోడుగా ఛటేశ్వర్ పుజారా క్రీజులో ఉన్నాడు. అగర్వాల్ 22 పరుగులతో ఆడుతున్నాడు. ఈ మ్యాచ్ ద్వారా వెస్టిండీస్ జట్టులో రకీమ్ కార్న్ వాల్ అరంగేట్రం చేశాడు. కార్న్ వాల్ తన 140 కిలోల బరువుతో మ్యాచ్ కు ముందే అందరి దృష్టిలో పడ్డాడు.