Andhra Pradesh: ఇసుక విధానంలో కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ ప్రభుత్వం
- టెండర్లను రద్దు చేసిన ప్రభుత్వం
- అతి తక్కువ ధరకు టెండర్లు కోట్ చేయడంతో కీలక నిర్ణయం
- జీపీఎస్ ఉన్న ట్రక్కుల యజమానులకు అవకాశం
కొత్త ఇసుక విధానంలో రవాణా టెండర్లను రద్దు చేస్తూ ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు నిన్న అర్ధరాత్రి రాష్ట్ర గనుల శాఖ ఆదేశాలు జారీ చేసింది. కిలోమీటర్ కు ఇసుక తరలింపుకు అతి తక్కువ ధర కోట్ చేయడంతో ఈ నిర్ణయం తీసుకుంది. జిల్లా మొత్తానికి ఒకే కాంట్రాక్టర్ ఉంటే ఇబ్బందులు వస్తాయని ప్రభుత్వం భావించింది. మరోవైపు, జీపీఎస్ ఉన్న ట్రక్కుల యజమానులు దరఖాస్తు చేసుకుంటే... వారికి అవకాశం ఇస్తామని తెలిపింది. కిలోమీటరు రవాణాకు రూ. 4.90 ఖరారు చేసినట్టు వెల్లడించింది.