CPI Narayana: అమెరికాలోని వైట్‌హౌస్‌ ముందు సీపీఐ నారాయణ నిరసన

  • కశ్మీర్‌ సమస్యపై అగ్రదేశం తీరుపై ఆగ్రహం
  • యుద్ధం పరిష్కారం కాదంటూ వ్యాఖ్య
  • మానవ హక్కులు ట్రంప్‌ సొంతం కాదని ధ్వజం

జమ్మూ కశ్మీర్‌పై ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఏకంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ నివాసం వైట్‌హౌస్‌ ముందు నిరసన తెలియజేసి సంచలనం సృష్టించారు. కశ్మీర్‌ అంశంపై అమెరికా అనుసరిస్తున్న విధానంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ పలు వర్గాలు వాషింగ్టన్‌లోని వైట్‌హౌస్‌ ముందు నిరసనలు తెలియజేస్తున్నాయి. ఈ నిరసనల్లో నారాయణ పాల్గొని గొంతు కలిపారు.

మానవహక్కులు ట్రంప్‌ సొంతం కాదని, కశ్మీర్‌లో మారణకాండ ఆపాలని, దీనికి యుద్ధం పరిష్కారం కాదని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ కశ్మీర్‌కు తగిన పరిష్కారం చూపి న్యాయం చేయాలని కోరారు.  అగ్రరాజ్యం అమెరికాలోనే వైట్‌హౌస్‌కు కొద్దిదూరంలో నిరసన తెలియజేస్తే నేరం కాదని, కానీ ఏపీ, తెలంగాణల్లో ముఖ్యమంత్రుల నివాసాలకు 10 కిలోమీటర్ల దూరంలో నిరసన తెలిపినా నేరమేనని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News