Prabhas: నేను ప్రేమించినా, నా పెళ్లి కుదిరినా...: ప్రభాస్

  • ఏది జరిగినా అందరికీ చెప్పేస్తా
  • నా ఫ్యాన్స్ కు ఓపిక అధికం
  • రెండేళ్లు ప్రేమగా ఎదురుచూశారన్న ప్రభాస్

తాను ఎవరినైనా ప్రేమించినా, తన వివాహం నిశ్చయమైన, అభిమానులకు వెంటనే చెబుతానని, ఈ విషయంలో దాచి పెట్టేది ఏమీ లేదని యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ వ్యాఖ్యానించాడు. తాను నటించిన 'సాహో' ప్రమోషన్ లో బిజీగా ఉన్న ఆయన, ఓ పత్రికకు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చాడు. తనపై ఎన్నో ప్రేమకథలు వచ్చాయని, వాటిపై తాను ఇప్పటికే చాలా సందర్భాల్లో స్పందించానని, అయినా వార్తలు ఆగడం లేదని అన్నాడు.

తాను లవ్ చేస్తే, ఆ విషయాన్ని కచ్చితంగా అందరితో చెబుతానని తెలిపాడు. తన ఫ్యాన్స్ కు ఎంతో ఓపికని, రెండేళ్ల పాటు సినిమా రాకున్నా ప్రేమతో ఎదురు చూసి డైహార్డ్ ఫాన్స్ అయిపోయారని అన్నారు. వారి ప్రేమను చూస్తుంటే, ఓ వైపు గర్వంగాను, మరోవైపు భయంగానూ అనిపిస్తుంటుందని, వారి నమ్మకాన్ని, ప్రేమను నిలుపుకునేందుకు మరింత జాగ్రత్తగా ఉంటానని అన్నారు,.

  • Loading...

More Telugu News