India: నాకు, అభినందన్ కు మధ్య ఉన్న పోలికలు ఇవే!: ఐఏఎఫ్ చీఫ్ బీఎస్ ధనోవా ఆసక్తికర వ్యాఖ్యలు

  • పఠాన్ కోట్ లో ధనోవా, అభినందన్ విహారం
  • 30 నిమిషాల పాటు మిగ్-21లో చక్కర్లు
  • అభినందన్ తండ్రితో కలిసి పనిచేసిన ధనోవా

భారత వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్ ఈరోజు మళ్లీ విధుల్లో చేరిన సంగతి తెలిసిందే. పంజాబ్ లోని పఠాన్ కోట్ ఎయిర్ బేస్ లో వాయుసేన చీఫ్ ఎయిర్ చీఫ్ మార్షల్ బీఎస్ ధనోవాతో కలిసి 30 నిమిషాల సేపు మిగ్-21 యుద్ధవిమానంలో ఈరోజు విహరించారు. ఈ నేపథ్యంలో ఐఏఎఫ్ చీఫ్ ధనోవా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వింగ్ కమాండర్ అభినందన్, తనకు మధ్య రెండు అంశాల్లో సారూప్యత ఉందని ధనోవా తెలిపారు. తామిద్దరం విమానం కాక్ పీట్ నుంచి బయటపడ్డామని ధనోవా తెలిపారు.

అలాగే తాను కార్గిల్ యుద్ధంలో పోరాడితే, అభినందన్ బాలాకోట్ ఘటన తర్వాత పాక్ వైమానికదళంతో పోరాడాడని కితాబిచ్చారు. తాను, అభినందన్ తండ్రి వేర్వేరు స్క్వాడ్రన్లలో పనిచేశామని గుర్తుచేసుకున్నారు. అలాంటి వ్యక్తి కుమారుడితో కలిసి తన చివరి విమాన ప్రయాణం చేయడం నిజంగా గౌరవంగా భావిస్తున్నట్లు ఎయిర్ చీఫ్ మార్షల్ ధనోవా పేర్కొన్నారు. అభినందన్ తిరిగి 6 నెలల్లోనే విధుల్లో చేరడం సంతోషంగా ఉందన్నారు. 1988 సమయంలో తాను విమానం నుంచి ఎజెక్ట్ అయ్యాననీ, కానీ తిరిగి విధుల్లోకి చేరడానికి తనకు 9 నెలలు పట్టిందని చెప్పారు.

  • Loading...

More Telugu News