ONGC: ముంబై ఓఎన్జీసీలో భారీ అగ్నిప్రమాదం!
- ఉరాన్ లోని సంస్థ గిడ్డంగిలో ప్రమాదం
- కోట్లాది రూపాయల ఆస్తి నష్టం
- మంటలార్పేందుకు ఫైర్ సిబ్బంది ప్రయత్నం
ముంబైలోని ప్రభుత్వ రంగ చమురు దిగ్గజం ఓఎన్జీసీ (ఆయిల్ అండ్ నాచురల్ గ్యాస్ కార్పొరేషన్) గోదాములో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఉదయం ఉరాన్ సమీపంలోని గోడౌన్ లో జరిగిన ఫైర్ యాక్సిడెంట్ లో శీతల గిడ్డంగిలోని కోట్లాది రూపాయల విలువైన యంత్ర సామగ్రి, ఇతర ఉపకరణాలు, ముడి చమురు దగ్ధమయ్యాయి.
సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఐదు ఫైరింజన్లతో వచ్చి మంటలను ఆర్పేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు, ఆ ప్రాంతం చమురు శుద్ధి కర్మాగారం పరిధిలో ఉండటంతో, తగు జాగ్రత్తలతో మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తుండగా, ఇప్పటివరకూ మంటలు అదుపులోకి రాలేదు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు వ్యాపించివుండవచ్చని, ఘటనపై విచారణను జరుపుతామని ఓఎన్జీసీ అధికారులు వెల్లడించారు. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణనష్టమూ జరగలేదని తెలుస్తోంది.