Moon: ఈ ఉదయం 8.50కి... 'చంద్రయాన్-2' డీ ఆర్బిటింగ్ విజయవంతం!

  • నాలుగు సెకన్ల పాటు ప్రొపల్షన్ వ్యవస్థను ఆన్ చేసిన శాస్త్రవేత్తలు
  • చంద్రునికి గరిష్ఠంగా 128 కి.మీ దూరానికి ఆర్బిటర్
  • రేపు మరోసారి కక్ష్య తగ్గింపు

భారత ప్రభుత్వ అంతరిక్ష సంస్థ ఇస్రో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-2లో మరో కీలక ఘట్టం విజయవంతమైంది. ఈ ఉదయం 8.50 గంటలకు చంద్రుని కక్ష్యలో తిరుగుతున్న దూరాన్ని ఆర్బిటర్ తగ్గించుకుంది. నాలుగు సెకన్ల పాటు ప్రొపల్షన్ వ్యవస్థను ఆన్ చేయడం ద్వారా కక్ష్యను తగ్గించినట్టు ఇస్రో తెలిపింది. ప్రస్తుతం విక్రమ్ ల్యాండర్ 104/128 కిలోమీటర్ల దూరంలో చంద్రుని చుట్టూ పరిభ్రమిస్తోందని, తదుపరి డీ-ఆర్బిటింగ్ ను రేపు తెల్లవారుజామున 3.30 నుంచి 4.30 గంటల మధ్య చేపడతామని పేర్కొంది. కాగా, ఆపై మూడు రోజుల తరువాత విక్రమ్ ల్యాండర్ చంద్రునిపై దిగుతుంది. 

  • Loading...

More Telugu News