Rafale: మరో 10 రోజుల్లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అమ్ములపొదిలోకి చేరనున్న తొలి రాఫెల్
- 19న భారత్ కు అందనున్న తొలి రాఫెల్
- ఫ్రాన్స్ లోని మెర్గినాక్ లో విమానం అప్పగింత కార్యక్రమం
- హాజరుకానున్న రాజ్ నాథ్ సింగ్, ధనోవా
అత్యాధునికమైన రాఫెల్ తొలి యుద్ధ విమానం ఈనెల 19న భారత వాయుసేన అమ్ములపొదికి చేరనుంది. తొలి విమానాన్ని భారత్ కు ఫ్రాన్స్ లాంఛనంగా అందించనుంది. ఫ్రాన్స్ లోని మెర్గినాక్ లో విమానం అప్పగింత కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమానికి భారత్ రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్, ఎయిర్ చీఫ్ మార్షల్ ధనోవాలతో పాటు పలువురు అధికారులు హాజరుకానున్నారు.
రాఫెల్ విమానాల కోసం 2016 సెప్టెంటర్ 23న ఒప్పందం జరిగింది. ఈ డీల్ విలువ రూ. 59 వేల కోట్లు. సెప్టెంబర్ 19న కేవలం ఒక రాఫెల్ యుద్ధ విమానాన్ని మాత్రమే అందించనున్నారు. తొలి బ్యాచ్ లో అందాల్సిన నాలుగు విమానాలను వచ్చే ఏప్రిల్-మే నెలల్లో అందిస్తారు. 2022 సెప్టెంబర్ నాటికి మొత్తం 36 యుద్ధ విమానాలు మనకు అందుతాయి.