Chiranjeevi: మెగాస్టార్ సరసన నాయికగా ఇలియానా?

  • 'సైరా' కోసం మెగా ఫ్యాన్స్ వెయిటింగ్ 
  • చిరూతో సినిమా కోసం కొరటాల సన్నాహాలు 
  • గ్రీన్ సిగ్నల్ ఇవ్వని ఐశ్వర్య రాయ్ 

చిరంజీవి అభిమానులంతా 'సైరా' విడుదల రోజైన అక్టోబర్ 2వ తేదీ కోసం వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. మరో వైపున చిరంజీవి తన తదుపరి సినిమా కోసం సిద్ధమవుతున్నారు. ఈ సినిమాకి కొరటాల శివ దర్శకత్వం వహించనున్నారు. త్వరలో ఈ ప్రాజెక్టును పట్టాలెక్కించడానికి ఆయన తన వైపు నుంచి అన్ని పనులను పూర్తి చేస్తూ వస్తున్నారు.

ఈ సినిమాలో చిరంజీవి బరువు తగ్గి, డిఫరెంట్ హెయిర్ స్టైల్ లో కనిపించనుండటం అనే అంశం ఇప్పటికే అభిమానుల్లో ఆసక్తిని పెంచేసింది. ఈ సినిమాలో ఆయన హాకీ కోచ్ గా కనిపించనున్నారనే మరో వార్త మరింత కుతూహలాన్ని పెంచుతోంది. ఈ సినిమాలో చిరంజీవి సరసన నాయికగా ఐశ్వర్య రాయ్ అయితే బాగుంటుందనే ఉద్దేశంతో కొరటాల చేసిన ప్రయత్నాలు ఫలించలేదని సమాచారం. దాంతో ఆయన ఇలియానాతో సంప్రదింపులు జరుపుతున్నట్టుగా చెప్పుకుంటున్నారు. 'అమర్ అక్బర్ ఆంటోని' చిత్రం ద్వారా ఆ మధ్య ఇలియానా రీ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News