Andhra Pradesh: చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిన వైసీపీ నేత సియ్యారి దొన్నుదొర!

  • యరపతినేనికి అండగా నిలవాలని బాబు నిర్ణయం
  • 100 రోజుల్లో 8 మంది టీడీపీ నేతల్ని చంపేశారని ఆవేదన
  • ఇసుక బస్తా సిమెంట్ బస్తా కంటే ఖరీదుగా మారిపోయిందని ఎద్దేవా

ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం నేత యరపతినేని శ్రీనివాస్ అక్రమ మైనింగ్ కేసును సీబీఐకి అప్పగించాలని ఏపీ కేబినెట్ ఈరోజు నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో యరపతినేనికి అండగా నిలవాలని టీడీపీ అధిష్ఠానం నిర్ణయించింది. టీడీపీ నేతలపై కావాలనే వైసీపీ ప్రభుత్వం తప్పుడు కేసులు పెడుతోందని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు విమర్శించారు. వైసీపీ సర్కారు అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే 8 మంది టీడీపీ నేతలను చంపేశారని ఆవేదన వ్యక్తం చేశారు.

తెలుగుదేశం వల్లే తమకు న్యాయం జరుగుతుందని ఏపీ ప్రజలు అనుకుంటున్నారని వ్యాఖ్యానించారు. గుంటూరులో ఈరోజు పర్యటించిన చంద్రబాబు.. వైసీపీ నేత దొన్నుదొరను పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం మాట్లాడుతూ.. ఏపీలో సిమెంట్ బస్తా ధర కంటే ఇసుక బస్తా ధర అధికంగా ఉందని చంద్రబాబు దుయ్యబట్టారు. టీడీపీపై నమ్మకంతోనే సియ్యారి దొన్నుదొర పార్టీలో చేరారని వ్యాఖ్యానించారు. గిరిజనుల అభివృద్ధి, సంక్షేమం కోసం కృషి చేసిన ఘనత తమదేనని చంద్రబాబు పేర్కొన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో అరకు అసెంబ్లీ సీటు నుంచి వైసీపీ రెబెల్ గా పోటీచేసిన దొన్నుదొర రెండో స్థానంలో నిలిచారు.

  • Loading...

More Telugu News