Sensex: భారీ నష్టాల నుంచి కోలుకున్న స్టాక్ మార్కెట్
- నిన్న భారీగా పతనమైన మార్కెట్లు
- ఈరోజు 162 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
- 47 పాయింట్లు పెరిగిన నిఫ్టీ
నిన్న భారీగా పతనమైన దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు కోలుకున్నాయి. ఐటీ, ఇన్ఫ్రా, బ్యాంకింగ్ స్టాకుల అండతో లాభాల బాట పట్టాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 162 పాయింట్లు లాభపడి 36,725కు చేరుకుంది. నిఫ్టీ 47 పాయింట్లు పెరిగి 10,845 వద్ద స్థిరపడింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
భారతీ ఎయిర్ టెల్ (2.97%), టాటా స్టీల్ (2.72%), ఎస్బీఐ (2.40%), వేదాంత లిమిటెడ్ (2.24%), ఎన్టీపీసీ (1.79%).
టాప్ లూజర్స్:
మారుతి సుజుకి (-4.13%), సన్ ఫార్మా (-3.06%), ఏసియన్ పెయింట్స్ (-2.63%), టాటా మోటార్స్ (-2.53%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (-2.17%).