Andhra Pradesh: ఒడిశా తీరానికి ఆనుకుని అల్పపీడనం... ఉత్తరాంధ్రకు భారీ వర్ష సూచన!
- 7.6 కిమీ ఎత్తున ఉపరితల ఆవర్తనం
- కోస్తాలో ఓ మోస్తరు వానలు
- రాయలసీమలో అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశం
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఒడిశా తీరాన్ని ఆనుకుని కొనసాగుతోంది. దీనికి అనుబంధంగా 7.6 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఈ కారణంగా ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, కోస్తాలో పలు చోట్ల ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ విభాగం పేర్కొంది. రాయలసీమలోనూ అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. తీరం వెంబడి గంటకు 50 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరించారు. అదే సమయంలో తెలంగాణలో మరో మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని తెలిపారు.