Chinthamaneni Prabhakar: టీడీపీ నేత చింతమనేనిపై కేసుల విషయంలో నిర్లక్ష్యం.. పోలీసులపై చర్యలు!
- సీఐ, ఎస్సైలపై చర్యలకు ఎస్పీ ఆదేశం
- సీఐని సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేసిన ఏలూరు రేంజ్ డీఐజీ
- చింతమనేనిపై 50 కేసులు
టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పై పలు కేసులు నమోదైన సంగతి తెలిసిందే. అయితే, ఈ కేసుల దర్యాప్తులో సరిగా వ్యవహరించలేదంటూ పలువురు అధికారులపై వేటు పడింది. ఏలూరు త్రీ టౌన్ సీఐ, ఎస్సైలతో పాటు పెదవేగి ఎస్సైలపై చర్యలకు పశ్చిమగోదావరి జిల్లా ఎస్పీ ఆదేశించారు. ఇదే సమయంలో సీఐని సస్పెండ్ చేస్తూ ఏలూరు రేంజ్ డీఐజీ ఆదేశాలు జారీ చేశారు. వారితో పాటు మరో ఇద్దరు ఎస్సైలు, కానిస్టేబుళ్లపై కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉంది. చింతమనేనిపై 50 కేసులు ఉన్నాయని ఎస్పీ నవదీప్ సింగ్ ఇప్పటికే వెల్లడించిన సంగతి తెలిసిందే.