Srisailam: శ్రీశైలం జలాశయానికి మళ్లీ పోటెత్తిన వరద
- ఎగువ కృష్ణా నదీ పరీవాహక ప్రాంతాల్లో వర్షాలు
- పరవళ్లు తొక్కుతున్న కృష్ణమ్మ
- శ్రీశైలం ప్రాజెక్టుకు 2.17 లక్షల క్యూసెక్కుల ఇన్ ఫ్లో
ఎగువ కృష్ణా నదీ పరీవాహక ప్రాంతంలో విస్తారంగా వర్షాలు కురుస్తుండడంతో శ్రీశైలం జలాశయానికి మరోసారి వరద పోటెత్తింది. శ్రీశైలం ప్రాజెక్టుకు ప్రస్తుతం 2.17 లక్షల క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తుండగా, దిగువకు 80 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. శ్రీశైలం జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుతం నీటిమట్టం 878.7 అడుగులకు చేరుకుంది. ఇప్పటికే వరద నీటి నియంత్రణపై విమర్శల పాలవుతున్న ఏపీ సర్కారు దీనిపై ఎలా స్పందిస్తుందన్నది వేచి చూడాలి. ఇటీవల కృష్ణా నది వరదల కారణంగా పంటలు నీట మునగడమే కాకుండా, పలు గ్రామాలు జలదిగ్బంధనంలో చిక్కుకున్నాయి.