Undavalli Sridevi: ఉండవల్లి శ్రీదేవి ఓ క్రిస్టియన్... అట్రాసిటీ కేసు ఎలా పెడతారు?: మాజీ మంత్రి జవహర్
- వైసీపీ ఎమ్మెల్యే శ్రీదేవిపై జవహర్ విమర్శలు
- ఉండవల్లి శ్రీదేవి దళితురాలు కాదంటూ వ్యాఖ్యలు
- ఆమెపై ఎన్నికల సంఘం అనర్హత వేటు వేయాలంటూ విజ్ఞప్తి
ప్రజల కోసం చేసిన చట్టాలను పాలకులు తమ సొంతానికి వాడుకోవడం బాధాకరం అని మాజీ మంత్రి కేఎస్ జవహర్ వ్యాఖ్యానించారు. బాధితుల కోసం తీసుకువచ్చిన అట్రాసిటీ చట్టాన్ని ఉండవల్లి శ్రీదేవి తన స్వార్థానికి వాడుకోవడం దారుణమని అన్నారు. వైసీపీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి వర్సెస్ టీడీపీ నేతలు వ్యవహారంలో జవహర్ ఘాటుగా స్పందించారు. శ్రీదేవి అసలు దళితురాలే కాదని, ఆమె ఓ క్రిస్టియన్ అని వెల్లడించారు. ఓ క్రిస్టియన్ అయివుండి అట్రాసిటీ కేసు ఎలా పెడతారంటూ ప్రశ్నించారు.
శ్రీదేవి కులంపై అనేక ఫిర్యాదులు ఉన్నాయని, ఈసీకి కూడా ఆమెపై ఫిర్యాదులు వెళ్లాయని తెలిపారు. ఓట్లు వేయించుకుని ప్రజల్ని మోసం చేసి, ఇప్పుడు దేవుడ్ని కూడా మోసగించారని మండిపడ్డారు. దళితురాలు కాని శ్రీదేవిపై ఎన్నికల సంఘం అనర్హత వేటు వేయాలని జవహర్ విజ్ఞప్తి చేశారు.