Bipin Rawat: పాక్ ఆర్మీ చీఫ్ వ్యాఖ్యలకు దీటుగా బదులిచ్చిన భారత సైన్యాధిపతి

  • చివరి బుల్లెట్ వరకు పోరాడతామన్న పాక్ సేనాని
  • భారత్ నుంచి తప్పించుకోలేరంటూ హెచ్చరించిన ఆర్మీ చీఫ్  
  • పాకిస్థాన్ కు తన సొంత బలగాలపైనే నమ్మకంలేదంటూ వ్యాఖ్యలు

కశ్మీర్ లో జరుగుతున్న నరమేధానికి చివరి బుల్లెట్ వరకు పోరాడతామంటూ పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ జావేద్ బజ్వా వీరావేశంతో చేసిన వ్యాఖ్యలపై భారత ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్ స్పందించారు. ఏదైనా హింస సృష్టించాలని చూస్తే భారత్ నుంచి తప్పించుకోవడం పాకిస్థాన్ వల్ల కాదని హెచ్చరించారు.

అసలు పాకిస్థాన్ కు తమ సొంత బలగాలపైనే నమ్మకం లేదని వ్యాఖ్యానించారు. అందుకే తరచుగా అణ్వాయుధాల గురించి మాట్లాడుతూ బెదిరింపులకు దిగుతున్నారని విమర్శించారు. పాక్ ఉగ్రవాదుల నుంచి ముప్పు పొంచివుందని నిఘా వర్గాలు హెచ్చరిస్తున్నాయని, అయితే ఎలాంటి విపత్కర పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు భారత సైన్యం సంసిద్ధంగా ఉందని బిపిన్ రావత్ స్పష్టం చేశారు. పాకిస్థాన్ ఎల్ వోసీ దిశగా భారీగా దళాలను తరలిస్తోందని, ఈ పరిణామం పట్ల తాము అప్రమత్తంగానే ఉన్నామని చెప్పారు.

  • Loading...

More Telugu News