bay of bengal: ఉత్తర ఒడిశా పరిసరాల్లో కొనసాగుతున్న అల్పపీడనం.. కోస్తాలో తీరం వెంబడి బలమైన గాలులు
- రానున్న 24 గంటల్లో కోస్తాలో పలుచోట్ల వర్షాలు
- రాయలసీమలో ఉరుములతో కూడిన వర్షాలు పడే అవకాశం
- మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని హెచ్చరిక
ఉత్తర ఒడిశా పరిసరాల్లో ఏర్పడిన అల్పపీడనం కొనసాగుతోంది. తూర్పు మధ్య బంగాళాఖాతం వరకు రుతుపవన ద్రోణి పయనిస్తుండడంతోపాటు దక్షిణ ఒడిశా మీదుగా తూర్పు పడమర వరకు ద్రోణి కొనసాగుతుంది. దీని ప్రభావంతో కోస్తా, రాయలసీమల్లో కొన్ని ప్రాంతాల్లో చెదురుమదురుగా వర్షాలు పడ్డాయి. రానున్న 24 గంటల్లో కోస్తాలో పలుచోట్ల, రాయలసీమలో అక్కడక్కడ ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
ఇక అల్పపీడన ప్రభావంతో కోస్తాలో తీరం వెంబడి గంటకు 45 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని, కాబట్టి మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లవద్దని హెచ్చరికలు జారీ చేశారు.