River Godavari: గోదావరి ఉగ్రరూపం.. ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ

  • గోదావరికి పెరుగుతున్న వరద ఉద్ధృతి
  • అంతకంతకు పెరుగుతున్న నీటిమట్టం
  • 13.22 లక్షల క్యూసెక్కుల నీరు దిగువకు

గత రెండు మూడు రోజులుగా గోదావరి నదికి వరద ఉద్ధృతి పెరుగుతోంది. నది అంతకంతకూ ఉగ్రరూపం దాల్చుతుండడంతో ధవళేశ్వరం వద్ద అధికారులు రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. నీటిమట్టం 14.10 అడుగులకు పెరగడంతో 13.22 లక్షల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడిచిపెట్టారు. మరోవైపు, వరద ఉద్ధృతి కారణంగా దేవీపట్నం మండలంలోని 36 గ్రామాలతోపాటు విలీన మండలాల్లోని 20 గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి.

  • Loading...

More Telugu News