Mahanandi: కోతుల దెబ్బ... పక్కకు ఒరిగిన మహానంది ప్రధాన గోపుర కలశాలు!

  • కర్నూలు జిల్లాలో ఉన్న మహానంది
  • అటవీ ప్రాంతం కావడంతో అధికమైన కోతుల బెడద
  • త్వరలో నూతన కలశాల ప్రతిష్ఠాపన
కర్నూలు జిల్లా పరిధిలోని నల్లమల అడవుల్లో స్వయంభువుగా వెలిసిన మహానంది క్షేత్రం, ప్రధాన గోపురం కలశాలు పక్కకు ఒరిగి పోవడంతో భక్తులు ఆందోళనకు గురయ్యారు. ఈ ప్రాంతంలో కోతుల బెడద విపరీతంగా పెరిగిపోవడం, అవన్నీ గోపురం పైకి ఎక్కి, కలశాలను పట్టుకుని తమ విన్యాసాలను ప్రదర్శిస్తుండటంతోనే కలశాలు పక్కకు ఒరిగాయని అధికారులు తేల్చారు.

నిన్న గోపురం కలశాలు ఒరగడాన్ని గమనించిన భక్తులు, విషయాన్ని దేవస్థానం దృష్టికి తీసుకు వెళ్లడంతో, ఓ ఉద్యోగిని పైకి ఎక్కించి కలశాలను తిరిగి నిలువుగా ఉంచారు. కొన్ని రోజుల తరువాత మంచి ముహూర్తం చూసుకుని, పీఠాధిపతుల సమక్షంలో ప్రధాన గోపురం సహా, మిగతా గోపురాలకు నూతన కలశాలను ప్రతిష్ఠింపజేస్తామని ఆలయ పండితులు వెల్లడించారు.
Mahanandi
Kurnool District
Nallamala
Monkeys

More Telugu News