ISRO: విక్రమ్ ల్యాండర్ బాగానే వుంది... చెక్కుచెదరలేదంటున్న ఇస్రో వర్గాలు!

  • భారతీయులకు ఊరట!
  • కాస్త వంగి ఉన్నా దృఢంగానే ఉందంటున్న సైంటిస్టులు!
  • కమ్యూనికేషన్ పునరుద్ధరణకు శాస్త్రవేత్తల కృషి 

భారతీయులకు ఎంతో ఊరట కలిగించే విషయం ఇది! చంద్రయాన్-2 ప్రాజెక్టులో ఎంతో కీలకమైన విక్రమ్ ల్యాండర్ సురక్షితంగా ఉందని ఇస్రో వర్గాలంటున్నాయి. చంద్రుడి ఉపరితలాన్ని బలంగా ఢీకున్నప్పటికీ చెక్కుచెదరలేదని, అయితే కాస్త వంగి ఉందని సమాచారం. ల్యాండర్ కు చిన్నపాటి డ్యామేజి కూడా జరగలేదని, ముక్కలవడం అసలే లేదని తెలుస్తోంది. ల్యాండర్ తో కమ్యూనికేషన్ పునరుద్ధరణకు ఇస్రో శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తున్నారని ఇస్రో చైర్మన్ శివన్ ఇంతకుముందే తెలిపారు.

చంద్రయాన్-2 ప్రాజెక్టులో భాగంగా చంద్రుడి ఉపరితలంపై సాఫీగా దిగాల్సిన విక్రమ్ ల్యాండర్ నుంచి సంకేతాలు ఆగిపోవడం తెలిసిందే. చంద్రుడి ఉపరితలంపైన 2.1 కిమీ దూరంలో ఉండగా విక్రమ్ ల్యాండర్ మూగబోయింది. ఏమైందో తెలియక యావత్ దేశంతో పాటు ఇస్రో వర్గాలు తల్లడిల్లిపోయిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News