Andhra Pradesh: ఏపీలో ప్రాంతీయ పార్టీలకు మనుగడ లేదు: సీఎం రమేశ్
- అందుకే, టీడీపీని వదిలి బీజేపీలో చేరాను
- ‘గండికోట’ ముంపు బాధితులకు నష్టపరిహారం ఇవ్వాలి
- మూడేళ్లకు జమిలి ఎన్నికలు వచ్చే అవకాశం ఉంది
కడప జిల్లా పోట్లదుర్తిలోని తన నివాసంలో బీజేపీ నేత సీఎం రమేశ్ ఈరోజు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. తాను టీడీపీని ఎందుకు వీడాల్సి వచ్చిందన్న విషయాన్ని స్పష్టం చేశారు. ఏపీలో ప్రాంతీయ పార్టీలకు మనుగడ లేదని, అందుకే, టీడీపీని వీడి బీజేపీలో చేరానని చెప్పారు.
కృష్ణా జలాలు రావడం వల్ల శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టులు పూర్తిగా నిండాయని అన్నారు. గండికోట ప్రాజెక్టు ముంపు బాధితులకు రూ.10 లక్షల చొప్పున నష్టపరిహారం ప్రకటించాలని డిమాండ్ చేశారు. అవుకు సొరంగం పనులు వెంటనే పూర్తి చేయాలని సూచించారు. ఈ సందర్భంగా జమిలి ఎన్నికల గురించి ఆయన ప్రస్తావించారు. మూడేళ్లకు జమిలి ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని చెబుతూ, ఈ ఎన్నికలకు వైసీపీ, టీఆర్ఎస్ పార్టీలు ఒప్పుకున్న విషయాన్ని ఆయన గుర్తుచేశారు.